99TV News

    కర్నూలులో ఉద్రిక్తత.. తొడకొట్టి మీసం మెలేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ | Kurnool...

    కర్నూలులో ఉద్రిక్తత.. తొడకొట్టి మీసం మెలేసిన వైకాపా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ | Kurnool...

    కర్నూలు:

    కర్నూలు నగరం పాతబస్తీ ప్రాంతంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ (Hafiz Khan) తీవ్రస్థాయిలో రెచ్చిపోయి నడిరోడ్డుపై రచ్చ సృష్టించారు.

    కారు పైకెక్కి బహిరంగ సవాల్‌

    కర్నూలు నగరంలోని వార్డు ప్రచారంలో సోమవారం పాల్గొన్న హఫీజ్‌ ఖాన్‌ను తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పైకెక్కి కూర్చున్న ఆయన.. "మీ అంతు చూస్తా" అంటూ రెండుసార్లు బహిరంగంగా తొడకొట్టి, మీసం మెలేస్తూ తెదేపా నేతలు, కార్యకర్తలను తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొనేలా ప్రవర్తించారు.

    పోలీసులను విడిపించుకుని మరీ రెచ్చగొట్టే యత్నం

    రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే హఫీజ్ ఖాన్ పోలీసుల నుంచి విడిపించుకుని మరీ వేలు చూపిస్తూ తెదేపా శ్రేణులను తీవ్రంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారు. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం, తెదేపా నాయకులను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తుండగా, తాజా ఘటనతో పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →